వోల్టాస్‌ కంప్రెసర్‌ తయారీ యూనిట్‌

ABN , First Publish Date - 2021-11-29T09:32:50+05:30 IST

అంతర్జాతీయ భాగస్వామితో కలిసి ఏసీ కంప్రెసర్‌ యూనిట్‌ నెలకొల్పాలని వోల్టాస్‌ యోచిస్తోంది. ఈ యూనిట్‌పై రూ.500 కోట్లు..

వోల్టాస్‌ కంప్రెసర్‌ తయారీ యూనిట్‌

న్యూఢిల్లీ: అంతర్జాతీయ భాగస్వామితో కలిసి ఏసీ కంప్రెసర్‌ యూనిట్‌ నెలకొల్పాలని వోల్టాస్‌ యోచిస్తోంది. ఈ యూనిట్‌పై రూ.500 కోట్లు ఇన్వెస్ట్‌ చేయనున్నట్టు కంపెనీ సీఈఓ ప్రదీప్‌ బక్షి తెలిపారు. ఆ అంతర్జాతీయ భాగస్వామి ఎవరన్నది వెల్లడించకుండానే ప్రపంచ శ్రేణిలో ప్రముఖ కంప్రెసర్ల తయారీ కంపెనీ అని మాత్రం చెప్పారు. ఈ యూనిట్‌ ఏర్పాటుకు ప్రెస్‌నోట్‌ 3 (పీఎన్‌-3) కావలసి ఉంటుందని, దానికి ఇప్పటికే దరఖాస్తు చేసి అనుమతుల కోసం వేచి చూస్తున్నామని ఆయన తెలిపారు. అలాగే ఈ యూనిట్‌ను ఎక్కడ ఏర్పాటు చేసేది కూడా ఇంకా నిర్ణయించాల్సి ఉన్నదన్నారు. 

Updated Date - 2021-11-29T09:32:50+05:30 IST