వివేకా హత్య కేసులో ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసిన సీబీఐ

ABN , First Publish Date - 2021-10-27T23:31:15+05:30 IST

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వివేకానంద రెడ్డి

వివేకా హత్య కేసులో ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసిన సీబీఐ

కడప: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో ఛార్జ్‌షీట్‌‌ను సీబీఐ దాఖలు చేసింది. వైఎస్‌ వివేకా మృతికి నలుగురు కారణమని సీబీఐ పేర్కొంది. గంగిరెడ్డి, సునీల్‌ యాదవ్‌, ఉమాశంకర్‌రెడ్డి, దస్తగిరిపై అభియోగాలు నమోదు చేసింది. ఆగస్టు, సెప్టెంబర్‌లో నిందితులను అరెస్టు చేశామని కోర్టుకు సీబీఐ తెలిపింది.  నిందితులను జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించామని సీబీఐ పేర్కొంది. ఇందులో ఇద్దరు నిందితులకు కోర్టు బెయిల్‌ మంజూరు చేసిందని సీబీఐ తెలిపింది. నాలుగు రోజుల క్రితమే దస్తగిరి ముందస్తు బెయిల్‌ పొందినట్లు సీబీఐ పేర్కొంది. కడప జైలులో సునీల్, ఉమాశంకర్ రెడ్డి  రిమాండ్‌లో ఉన్నారు. పులివెందుల కోర్టులో సీబీఐ ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. 

Updated Date - 2021-10-27T23:31:15+05:30 IST