Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఎమ్మెల్సీ పదవికి దేశపతి పనికి రాడా?: విఠల్

హైదరాబాద్: సీఎం కేసీఆర్ ప్రభుత్వంపై ఉద్యమనేత, టీఎస్ పీఎస్సీ మాజీ సభ్యుడు విఠల్ తీవ్రస్థాయిలో విరుచుపడ్డారు. ఎమ్మెల్సీ పదవికి ఉద్యమకారుడు దేశపతి  శ్రీనివాస్ కూడా పనికిరాడా అని ఆయన ప్రశ్నించారు. ఏబీఎన్‌తో ఆయన మాట్లాడారు. పదవులు ఉద్యమకారులు హక్కు అన్నారు. ఉద్యమకారులు బీజేపీలోకి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వటంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందన్నారు. ఖాళీగా ఉన్న 40వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.  ఉద్యోగాల భర్తీపై మాట్లాడాలని అడిగితే ముఖ్యమంత్రి సమయం ఇవ్వలేదన్నారు. ఆత్మగౌరవం‌ సంగతి అటుంచితే.. టీఆర్ఎస్‌లో ఉద్యమకారులను పలకరించే నాథుడే లేడన్నారు. 


సీఎం కేసీఆర్ నుంచి పిలుపు కోసం ఏడాది కాలంగా ఎదురుచూశానన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక కేసీఆర్ తన స్థాయిని తానే తగ్గించుకున్నాడని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చి‌న మాట వాస్తవమన్నారు. కానీ ప్రతిపక్ష పాత్రలో కాంగ్రెస్ విఫలమైందన్నారు. బీజేపీ వైపు తెలంగాణ ప్రజలు చూస్తున్నారన్నారు. బీజేపీలో మాత్రమే ఆత్మగౌరవం దక్కుతోందని తాను నమ్ముతున్నానని ఆయన పేర్కొన్నారు. జాతీయ పార్టీలో నాయకత్వం ఇచ్చే పనిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తానని ఏబీఎన్‌తో విఠల్ అన్నారు. 


Advertisement
Advertisement