Advertisement
Advertisement
Abn logo
Advertisement

విశాఖ వైసీపీలో వర్గపోరు

విశాఖ సిటీ: దక్షిణ నియోజకవర్గంలో వైసీపీ నేతల మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. పోటాపోటీగా మీడియా సమావేశాలు పెట్టి మరీ ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, ముగ్గురు వైసీపీ కార్పొరేటర్ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. తాజాగా ఎంవిడిఎం పాఠశాల వద్ద బడ్డీలు తొలగింపు ఘటనతో వీరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. సోమవారం మీడియా సమావేశం పెట్టి గణేష్ కుమార్ విమర్శలు చేస్తే.. ఈరోజు 39వ వార్డు కార్పొరేటర్ మహమ్మద్ సాధిక్, 35వ వార్డు కార్పొరేటర్ విల్లూరి భాస్కరరావు, 32వ వార్డు కార్పొరేటర్ కందుల నాగరాజులు మీడియా సమావేశం పెట్టి ఎమ్మెల్యే పై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. వాసుపల్లి గణేష్ కుమార్ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా ప్రవర్తిస్తున్నారని, ప్రభుత్వాని వ్యతిరేకంగా పని చేస్తున్నారని దీనిని ఎంపీ విజయసాయిరెడ్డి దృష్టికి తీసుకువెళతామని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. అయితే ఎమ్మెల్యే, కార్పొరేటర్ల వివాదంపై వైసీపీ అధిష్టానం ఇప్పటివరకు ఎటువంటి స్పందించలేదు. రానున్న రోజుల్లో ఈ వివాదాలు ఏ స్థాయిలోకి వెళ్తాయో వేచిచూడాల్సి ఉంది.

Advertisement
Advertisement