విశాఖ జిల్లా: అనకాపల్లిలో దారుణం

ABN , First Publish Date - 2020-06-05T18:26:16+05:30 IST

విజయవాడ గ్యాంగ్ వార్ ఘటన మరువకముందే విశాఖ జిల్లాలో మరో దారుణం చోటు చేసుకుంది.

విశాఖ జిల్లా: అనకాపల్లిలో దారుణం

అనకాపల్లి: విజయవాడ గ్యాంగ్ వార్ ఘటన మరువకముందే విశాఖ జిల్లాలో మరో దారుణం చోటు చేసుకుంది. అనకాపల్లిలో క్రికెట్ ఆడుతున్న యువకుడిపై మరో యువకుడు కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ వివాదం రెండు గ్యాంగ్‌ల మధ్య ఘర్షణకు దారితీసింది. ఈ వివాదంతో సాయి అనే యువకుడిపై సూర్య అనే యువకుడు కక్ష పెంచుకున్నాడు. తర్వాత సాయి, సూర్య మధ్య మళ్లీ గొడవ జరిగింది. కక్షతో రగిలిపోయిన సూర్య.. తన వెంట తెచ్చుకున్న కత్తితో సాయిపై దాడికి తెగబడ్డాడు. దీంతో సాయి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనలో సాయిని ఆస్పత్రికి తరలించిన పోలీసులు సూర్యను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2020-06-05T18:26:16+05:30 IST