‘విరుష్కడివోర్స్’ అంటూ ట్విట్టర్‌లో హ్యాష్‌ట్యాగ్.. షాక్‌లో నెటిజన్లు

ABN , First Publish Date - 2020-06-06T21:32:30+05:30 IST

శుక్రవారం ట్విట్టర్‌లో వైరల్ అయిన ఓ హ్యాష్‌ట్యాగ్ నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేసింది. ‘విరుష్కడివోర్స్’ అంటూ ట్విట్టర్‌లో శుక్రవారం రాత్రి ఓ హ్యాగ్‌ట్యాగ్ వైరల్

‘విరుష్కడివోర్స్’ అంటూ ట్విట్టర్‌లో హ్యాష్‌ట్యాగ్.. షాక్‌లో నెటిజన్లు

శుక్రవారం ట్విట్టర్‌లో వైరల్ అయిన ఓ హ్యాష్‌ట్యాగ్ నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేసింది. ‘విరుష్కడివోర్స్’ అంటూ ట్విట్టర్‌లో శుక్రవారం రాత్రి ఓ హ్యాగ్‌ట్యాగ్ వైరల్ అయింది. 2016లో ఓ వెబ్‌సైట్‌ రాసిన ఫేక్ న్యూస్‌ని చూసిన కొందరు నిజానిజాలు తెలుసుకోకుండా.. ఈ హ్యాష్‌ట్యాగ్‌ని వైరల్ చేశారు. ఒక్కసారిగా ఇది వైరల్ కావడంతో నెటిజన్లు షాక్ అయ్యారు. 


కొద్దిరోజుల క్రితం బీజేపీ ఎమ్మెల్యే నంద్‌కిషోర్ గుర్జార్ కూడా విరాట్.. అనుష్క‌కు విడాకులు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అనుష్క నిర్మాతగా వ్యవహరించిన ‘పాతాల్‌లోక్’ అనే వెబ్‌ సిరీస్‌లో మత విద్వేషాలు పుట్టించే సన్నివేశాలు ఉన్నాయని.. అంతేకాక.. ఆ సిరీస్‌ నిర్మాతగా వ్యవహరించిన అనుష్క దేశ ద్రోహి అని ఆయన అన్నారు. దేశం కోసం ఆడుతున్న విరాట్‌ దేశభక్తుడు కాబట్టి వెంటనే అనుష్కకు విడాకులు ఇచ్చి.. తన దేశభక్తిని చాటుకోవాలని డిమాండ్ చేశారు. 


ఈ నేపథ్యంలో శుక్రవాదం విరాట్, అనుష్కల విడాకులకు సంబంధించిన హ్యాష్‌ట్యాగ్ వైరల్ కావడం మరింత సంచలనంగా మారింది. అయితే ఇది ఫేక్‌న్యూస్ అని మరికొందరు స్పష్టత ఇచ్చారు. అంతేకాక.. పలువురు ఈ విషయంపై మీమ్స్ చేసి.. నెటిజన్లను అలరించారు. 

Updated Date - 2020-06-06T21:32:30+05:30 IST