వైరస్‌ విజృంభణ

ABN , First Publish Date - 2022-01-19T07:37:14+05:30 IST

వైరస్‌ విజృంభణ

వైరస్‌ విజృంభణ

కొత్తగా 6,996 కరోనా కేసులు నమోదు

మరో నలుగురు మృత్యువాత 

18.38 శాతానికి పెరిగిన పాజిటివిటీ 

డిప్యూటీ సీఎం కృష్ణదా్‌సకు పాజిటివ్‌

ప్రకాశంలో 15 మంది టీచర్లకూ

విశాఖ, నెల్లూరుల్లో 10 మంది వైద్యులకు వైరస్‌ 

చంద్రబాబుకు కరోనా 

స్వల్ప లక్షణాలు ఉన్నట్లు వెల్లడి 

స్వచ్ఛందంగా హోం క్వారంటైన్‌కు



(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

రాష్ట్రంలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. కొత్త కేసుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. సోమవారం 4వేల కేసులు నమోదవగా, మంగళవారం ఆ సంఖ్య 7వేలకు చేరువైంది. గత 24గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 38,055మందికి పరీక్షలు నిర్వహించగా, 6,996 మంది కరోనా బారినపడినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. సోమవారం 17.95గా ఉన్న పాజిటివిటీ రేటు మంగళవారానికి 18.38కి పెరిగింది. తాజాగా చిత్తూరు జిల్లాలో 1,534, విశాఖపట్నం 1,263, గుంటూరు 758, శ్రీకాకుళం 573, అనంతపురం 462, ప్రకాశం 424, కృష్ణాజిల్లాలో 326 చొప్పున కేసులు నమోదయ్యాయి. విశాఖపట్నంలో ఇద్దరు, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో  ఒక్కొక్కరు చొప్పున వైర్‌సతో మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాలు 14,514కి పెరిగాయి. ప్రస్తుతం అన్ని జిల్లాల్లో కలిపి 36,108 యాక్టివ్‌ కేసులు 

మిగతా 12వ పేజీలో... 


వైరస్‌ విజృంభణ

(మొదటి పేజీ తరువాయి)

ఉన్నాయి. కాగా, రెవెన్యూమంత్రి ధర్మాన కృష్ణదా్‌సకు కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్థారణ అయింది. ప్రస్తుతం హోం ఐసొలేషన్‌లో ఉన్నారు. ప్రకాశం జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో మంగళవారం 17మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయిం ది. వీరిలో 15మంది ఉపాధ్యాయులు ఉన్నారు. అనకాపల్లిలోని ఎన్టీఆర్‌ వైద్యాలయంలో కరోనా కలకలం రేగింది. నలుగురు వైద్యులు, ఐదుగురు స్టాఫ్‌ నర్సులు, ఒక ల్యాబ్‌ టెక్నీషియన్‌తో పాటు మరో ముగ్గురు నాలుగో తరగతి సిబ్బందికి పాజిటివ్‌ వచ్చింది. సోమవారం 54మందికి పరీక్షలు నిర్వహించగా 30మందికి పాజిటివ్‌ వచ్చినట్టు సూపరింటెండెంట్‌ శ్రావణ్‌కుమార్‌ తెలిపారు. కాగా, నెల్లూరు జిల్లా గూడూరు ఏరియా ఆస్పత్రిలో ఆరుగురు వైద్యులకు కొవిడ్‌ సోకింది. వారంతా హోం ఐసొలేషన్‌లో ఉన్నట్లు  సమాచారం. ఇక గుంటూరు జిల్లాలో గత రెండు రోజుల్లోనే 100మందికి పైగా కరోనా బారిన పడి ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు. బాధితుల సంఖ్య 137కు చేరింది. దీంతో మరో 100 బెడ్లు సిద్ధం చేస్తున్నామని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ తెలిపారు.

దశల వారీగా తరగతులు: ఆర్జీయూకేటీ వీసీ 

కొవిడ్‌ పరిస్థితుల దృష్ట్యా దశల వారీగా తరగతులు నిర్వహించాలని నిర్ణయించినట్లు ఆర్జీయూకేటీ వీసీ కె.సి.రెడ్డి తెలిపారు. ఫైనలియర్‌ ఇంజనీరింగ్‌ చదువుతున్న విద్యార్థులకు ఈ నెల 24నుంచి క్యాంప్‌సలలో తరగతులు ప్రారంభిస్తామన్నారు. మిగతా వారికి దశల వారీగా నిర్వహిస్తామన్నారు.


Updated Date - 2022-01-19T07:37:14+05:30 IST