ఆ ఘనత సాధించిన మూడో క్రికెటర్‌గా కోహ్లీ

ABN , First Publish Date - 2021-09-06T02:02:48+05:30 IST

టీమిండియా స్కిప్పర్ విరాట్ కోహ్లీ నేడు (ఆదివారం) అరుదైన రికార్డు సాధించాడు. ఇంగ్లండ్‌లో 1000 పరుగులు

ఆ ఘనత సాధించిన మూడో క్రికెటర్‌గా కోహ్లీ

లండన్: టీమిండియా స్కిప్పర్ విరాట్ కోహ్లీ నేడు (ఆదివారం) అరుదైన రికార్డు సాధించాడు. ఇంగ్లండ్‌లో 1000 పరుగులు సాధించిన మూడో భారత ఆటగాడిగా తన పేరును రికార్డు పుస్తకాల్లో లిఖించుకున్నాడు. ఇంగ్లండ్‌తో ది ఓవల్‌లో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి సెషన్‌లో క్రెయిగ్ ఒవెర్టన్ బౌలింగులో ఫోర్ కొట్టిన కోహ్లీ ఇంగ్లండ్‌లో 1000 పరుగులు సాధించిన ఘనత సొంతం చేసుకున్నాడు. ఫలితంగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లలో 1000కిపైగా పరుగులు చేసిన సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్ సరసన చేరాడు.  


సచిన్ ఆస్ట్రేలియాపై 1809, ఇంగ్లండ్‌పై 1575 పరుగులు చేయగా, రాహుల్ ద్రవిడ్ వరుసగా 1143, 1376 పరుగులు చేశాడు. కోహ్లీ ఆస్ట్రేలియాపై ఇప్పటి వరకు 1352 పరుగులు చేయగా, ఇంగ్లండ్‌లో తాజాగా 1000 పరుగుల మార్కు దాటాడు. 

Updated Date - 2021-09-06T02:02:48+05:30 IST