Advertisement
Advertisement
Abn logo
Advertisement

లండన్ నుంచి యూఏఈకి.. ప్రత్యేక విమానంలో కోహ్లీ, సిరాజ్!

లండన్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పార్ట్-2 కోసం ఫ్రాంచైజీలు సిద్ధమవుతున్నాయి. ఇండియాలో కరోనా రెండో దశ విజృంభణ కారణంగా అర్ధంతరంగా ఆగిపోయిన మ్యాచ్‌లు ఈ నెల 19 నుంచి యూఏఈలో జరగనున్నాయి. ఇప్పటికే పలు జట్లు అక్కడికి చేరుకుని ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టేశాయి.


ఈ నేపథ్యంలో తమ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, పేసర్ మహ్మద్ సిరాస్ కోసం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్రత్యేకంగా ఓ చార్టర్ విమానం ఏర్పాటు చేసింది. అందులో వారిద్దరూ నేరుగా ఇంగ్లండ్ నుంచి యూఏఈ చేరుకుంటారని ఆర్సీబీ తెలిపింది. వారి భద్రతను దృష్టిలో ఈ ఏర్పాటు చేసినట్టు వివరించింది. రేపు (ఆదివారం) ఉదయానికి వారిద్దరూ యూఏఈ చేరుకుంటారు. అనంతరం దుబాయ్‌లో ఆరు రోజుల తప్పనిసరి క్వారంటైన్‌లో గడుపుతారు.   


విరాట్ సారథ్యంలోని ఆర్సీబీ తన తొలి మ్యాచ్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఈ నెల 20న ఆడనుంది. కోహ్లీ సేన 5 విజయాలు, 2 పరాజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. ప్లే ఆఫ్స్‌లో చోటు కోసం ముందువరుసలో ఉంది. 


మరోవైపు, ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగు టెస్టుల్లో భారత్ రెండింటిలో విజయం సాధించి 2-1 ఆధిక్యంలో ఉంది. చివరి టెస్టు నిన్న జరగాల్సి ఉండగా, టీమిండియా బృందంలో కరోనా కలకలం రేగడంతో మ్యాచ్‌ను రద్దు చేశారు. అయితే, ఆగిపోయిన మ్యాచ్‌ను రీషెడ్యూల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు బీసీసీఐ తెలిపింది.  

Advertisement
Advertisement