కొవిడ్‌ వ్యాక్సిన్‌పై అపోహలు వద్దు

ABN , First Publish Date - 2021-04-17T05:54:20+05:30 IST

కొవిడ్‌ వ్యాక్సిన్‌పై అపోహలు వద్దు

కొవిడ్‌ వ్యాక్సిన్‌పై అపోహలు వద్దు
వ్యాక్సిన్‌ వేసుకున్న చీఫ్‌విప్‌ వినయ్‌భాస్కర్‌

ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌

హన్మకొండ అర్బన్‌/న్యూశాయంపేట, ఏప్రిల్‌ 16: 45ఏళ్లు నిండినవారు తప్పనిసిరగా కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకోవాలని, ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దని ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ అన్నారు. శాయంపేటలో యూపీహెచ్‌సీలో శుక్రవారం వినయ్‌భాస్కర్‌ తోపాటు ఆయన సతీమణి కొవిడ్‌ వ్యాక్సిన్‌  తీసుకున్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో డాక్టర్‌ కె.లలితాదేవి, వైద్యాధికారి డాక్టర్‌ మౌనిక, సిబ్బంది పాల్గొన్నారు. అలాగే శాయంపేట యూపీహెచ్‌సీలో ‘కుడా’ చైర్మన్‌ మర్రి యాదవరెడ్డి కూడా టీకా తీసుకున్నారు. 

కేయూలో కొనసాగిన వ్యాక్సినేషన్‌ 

కేయూ క్యాంపస్‌: కేయూ ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమం కొనసాగింది. కేయూ ఫైనాన్స్‌ ఆఫీసర్‌ తోట రాజయ్య, ఇతర ఉద్యోగులకు వ్యాక్సిన్లు వేశారు. నాలుగో తరగతి ఉద్యోగులు 70మంది వ్యాక్సిన్‌ వేసుకున్నారని వైద్యాధికారి డాక్టర్‌ అరుణ్‌కుమార్‌ తెలిపారు. కార్యక్రమంలో అరుణోదయ, రజియా, స్వప్న, ఫార్మసిస్టు పల్లవి, సలీం అహ్మద్‌, యాదగిరి, పున్నం చందర్‌, గుమ్మయ్య, పీఆర్‌వో డాక్టర్‌ వల్లాల పృథ్వీరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

  

Updated Date - 2021-04-17T05:54:20+05:30 IST