బెజవాడలో అడుగడుగునా పోలీసుల నిఘా

ABN , First Publish Date - 2022-02-03T13:20:58+05:30 IST

ఉద్యోగ సంఘాల ‘‘చలో విజయవాడ’’ పిలుపు నేపథ్యంలో బెజవాడలో అడుగడుగునా పోలీసులు నిఘా ఉంచారు.

బెజవాడలో అడుగడుగునా పోలీసుల నిఘా

విజయవాడ: ఉద్యోగ సంఘాల ‘‘చలో విజయవాడ’’ పిలుపు నేపథ్యంలో బెజవాడలో అడుగడుగునా పోలీసులు నిఘా  ఉంచారు. చలో విజయవాడ  బిఆర్‌పిఎస్ రోడ్డు వైపు వెళ్లే వాహనాలన్నీ వివిధ మార్గాల నుంచి దారి మళ్లించారు. రాష్ట్రవ్యాప్తంగా స్థానికంగా వాలంటీర్ల ద్వారా ఉద్యోగుల వివరాలను సేకరించారు. ఉద్యోగ సంఘాల నేతలకు ఎక్కడెక్కడ పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. రాష్ట్రంలో ఎవరైనా సరే విజయవాడకు కిరాయికి వెళ్ళద్దు అంటూ టాక్సీ వర్కర్స్ యూనియన్‌కు పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. రాయలసీమ జిల్లాల నుంచి అధిక సంఖ్యలో ఉద్యోగులు హాజరయ్యే అవకాశం ఉంది. నిర్బంధాన్ని దృష్టిలో పెట్టుకుని ఉద్యోగ సంఘాలు తమ వ్యూహ రచన మార్చుకుంటున్నాయి.  విజయవాడ నగరం పరిసర ప్రాంతాల్లోనీ  టోల్ ప్లాజాలు పోలీసుల ఆధీనంలోకి వెళ్లాయి. బిఆర్‌టిఎస్ రోడ్‌లోని మీసాల రాజేశ్వరరావు వంతెన మీదుగా చలో విజయవాడ ర్యాలీని ప్రారంభించి ఫుడ్ జంక్షన్ మీదుగా బహిరంగ సభ వేదికైన భాను నగర్‌కు చేరుకునే విధంగా ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ క్రమంలో రాత్రి నుంచి కృష్ణా జిల్లా వ్యాప్తంగా  పోలీసులు అప్రమత్తమయ్యారు. నేషనల్ హైవేలు, రైల్వే స్టేషన్లలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. 

Updated Date - 2022-02-03T13:20:58+05:30 IST