Durgamma temple EO: శరన్నవరాత్రి ఉత్సవాలకు 10 లక్షల మంది వస్తారని అంచనా

ABN , First Publish Date - 2022-09-23T18:42:07+05:30 IST

ప్రముఖ పుణ్యక్షేత్రం విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో జరిగే దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు 10 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామని దుర్గగుడి ఈవో భ్రమరాంబ తెలిపారు.

Durgamma temple EO: శరన్నవరాత్రి ఉత్సవాలకు 10 లక్షల మంది వస్తారని అంచనా

విజయవాడ: ప్రముఖ పుణ్యక్షేత్రం విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో జరిగే దసరా శరన్నవరాత్రి ఉత్సవాల (Dussehra Sharannavaratri festival)కు 10 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామని దుర్గగుడి ఈవో భ్రమరాంబ (Bramaramba) తెలిపారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... కోఆర్డినేషన్ కమిటి మీటింగ్‌లో అన్ని సూచనలు పరిగణంలోకి తీసుకొని ఏర్పాట్లు చేశామన్నారు. చిన్న చిన్న పనులు మినహా ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయని చెప్పారు. ఇంద్రకీలాద్రి లైటింగ్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకోబోతున్నామన్నారు. నవరాత్రి ఉత్సవాల్లో 21 లక్షల ప్రసాదాలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. భక్తులకు రెస్ట్ షెడ్స్ & వాష్ రూమ్స్ అధికంగా ఏర్పాటు చేశామన్నారు. ఉచిత, రూ.100, రూ.300 క్యూ లైన్లతో పాటు వీఐపీలకు ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేశామని ఈవో (Durgamma temple EO) అన్నారు.


భక్తులు ఎక్కడా ఆగకుండా ఉండేలా పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.  గతం 300 షవర్స్ ఏర్పాటు చేస్తే ఈసారి 800 షవర్స్ ఏర్పాటు చేశామన్నారు. వృద్దులకు, వికలాంగులకు బ్యాటరీ కార్‌ను అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. ఈ ఏడాది అన్నదానం నిర్వహించడంలేదని... భక్తులకు భోజన ప్యాకెట్స్ అందజేస్తున్నామని తెలిపారు. అంతరాలయం దర్శనానికి అనుమతి లేదన్నారు. 250 మందితో శానిటేషన్ సిబ్బందితో శానిటేషన్ ఏర్పాట్లు చేస్తున్నామని దుర్గగుడి ఈవో భ్రమరాంబ వెల్లడించారు. 

Updated Date - 2022-09-23T18:42:07+05:30 IST