మారువేషాల్లో బెజవాడకు ఉపాధ్యాయులు

ABN , First Publish Date - 2022-02-03T13:45:22+05:30 IST

చలో విజయవాడను విజయవంతం చేయాలనే పట్టుదలతో ఉన్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు మారువేషాల్లో బెజవాడకు వస్తున్నారు.

మారువేషాల్లో బెజవాడకు ఉపాధ్యాయులు

విజయవాడ: చలో విజయవాడను విజయవంతం చేయాలనే పట్టుదలతో ఉన్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు మారువేషాల్లో బెజవాడకు వస్తున్నారు. పోలీసులు ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు పెట్టి తనిఖీలు చేసినప్పటికీ వారిని తప్పించుకుని మరీ ఉద్యోగులు విజయవాడకు చేరుకుంటున్నారు. చలో విజయవాడ ర్యాలీకి రాష్ట్రంలో నలుమూలల నుండి బీఆర్‌టీఎస్‌ రోడ్డుకు ఉద్యోగ, ఉపాధ్యాయులు తరలివచ్చారు. పోలీసులు గుర్తు పట్టకుండా మారువేషాల్లో ఉపాధ్యాయులు వచ్చారు. కొందరు రైతు వేషధారణలో రాగా... మరికొందరు కూలీలుగా రేషన్ సంచులు పట్టుకుని వచ్చారు. పీఆర్సీ విషయంలో ఉద్యోగుల్ని ప్రభుత్వం దగా చేసిందని ఉద్యోగులు మండిపడుతున్నారు. చలో విజయవాడ బీఆర్‌టీఎస్‌ రోడ్డులో ర్యాలీ విజయవంతం చేసి తిరుతామని ఉద్యోగులు, ఉపాధ్యాయులు స్పష్టం చేస్తున్నారు. 

Updated Date - 2022-02-03T13:45:22+05:30 IST