Abn logo
Jul 5 2020 @ 13:33PM

దుర్గమ్మను 9500మంది భక్తులు దర్శించుకున్నారు: ఈవో సురేష్

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై అమ్మవారి శాకాంబరీ ఉత్సవాలను పురస్కరించుకుని అమ్మవారిని నిన్నటి వరకు 9500 మంది భక్తులు దర్శించుకున్నారని ఈవో సురేష్‌ బాబు తెలిపారు. ఈ రోజు 8000 వేల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామని చెప్పారు. సాయంత్రం 7 గంటల వరకు అమ్మవారి దర్శనం కలిపిస్తున్నామన్నారు. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి  మూడు రోజుల పాటు 30 టన్నుల కూరగాయలు పండ్లతో అలంకరణ చేసినట్లు ఈవో సురేష్ బాబు వెల్లడించారు.


అమ్మవారి ఆలయంలో శాకంబరీ దేవి ఉత్సవాలు పూర్ణాహుతితో ముగిశాయి. ఉత్సవాలు ఆఖరి రోజు కావడంతో అమ్మవారి దర్శనార్ధం భక్తులు తరలివస్తున్నారు. కూరగాయలు, పండ్లు రూపంలో దర్శనమిస్తున్న దుర్గమ్మను  భక్తులు దర్శించుకుని తరిస్తున్నారు. శాకాంబరీ దేవిని  సిపి బత్తిన శ్రీనివాసులు దర్శించుకున్నారు.

Advertisement
Advertisement
Advertisement