Advertisement
Advertisement
Abn logo
Advertisement
Oct 17 2021 @ 21:26PM

ముందస్తు లేవన్న కేసీఆర్ వ్యాఖ్యలపై రాములమ్మ సెటైర్

హైదరాబాద్: ముందస్తు ఎన్నికలకు వెళ్లబోవడం లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పడంపై బీజేపీ నాయకురాలు విజయశాంతి సెటైర్ వేశారు. కేసీఆర్ అబద్ధం తప్ప నిజం చెప్పనని ఒట్టు పెట్టుకున్న మనిషని రాములమ్మ ఎద్దేవా చేశారు. సందర్భం లేకుండా ముందస్తు ఎన్నికలు లేవని కేసీఆర్ చెప్పారంటే పక్కా ముందస్తు ప్రణాళిక ఉన్నట్లేనన్నారు. ఎన్నికలకు ప్రతిపక్షాలు సిద్ధమవడం మంచిదని విజయశాంతి సూచించారు. దీనికి సంబంధించి రాములమ్మ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. 

అంతకుముందు టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశంలో సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ ముందస్తు ఎన్నికలకు వెళ్లడం లేదని, చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయని తెలిపారు. ఇంకా రెండేళ్లు ఉందని, మరిన్ని ఎక్కువ స్థానాలు గెలిచేలా పనిచేయాలని టీఆర్ఎస్ నేతలకు సూచించారు.


ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement