రాష్ట్రంలో ఎంతమంది పీకేలొచ్చిన.. రాబోయేది బీజేపీ ప్రభుత్వమే: విజ‌య‌శాంతి

ABN , First Publish Date - 2022-04-27T01:53:57+05:30 IST

రాష్ట్రంలో ఎంతమంది పీకేలు వచ్చినా ఏమీ చెయలేరని.. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయ‌డం ఖాయమని బీజేపీ నేత విజ‌య‌శాంతి వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలో ఎంతమంది పీకేలొచ్చిన.. రాబోయేది బీజేపీ ప్రభుత్వమే: విజ‌య‌శాంతి

హైదరాబాద్: రాష్ట్రంలో ఎంతమంది పీకేలు వచ్చినా ఏమీ చెయలేరని.. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయ‌డం ఖాయమని బీజేపీ నేత విజ‌య‌శాంతి వ్యాఖ్యానించారు. మంగళవారం సోషల్ మీడియాలో రాములమ్మ ఈ మేరకు స్పందించారు. ఆ పోస్ట్‌ను యథాతధంగా ఇస్తున్నాం. ‘‘ఎన్నికల తర్వాత కేసీఆర్ అమెరికాకు బిస్తరు సర్దే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రతి గడ్డపైనా కాషాయ జెండా ఎగరడం ఖాయం. ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తుంటే టీఆర్ఎస్‌‌కు భయమేస్తోంది. కాంగ్రెస్‌‌లో ఎవరూ గెలవరు... గెలిచినా ఆ పార్టీలో ఉండరు. టీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ ఒక్కటే. ‘పీకే టిఫిన్ ప్రగతిభవన్‌‌లో... లంచ్ ఢిల్లీ ఏఐసీసీ ఆఫీసులో చేస్తున్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసే పోటీ చేస్తాయి. రెండు పార్టీలు ఒప్పందం కుదుర్చుకున్నది వాస్తవం. టీఆర్ఎస్‌‌ను ఎదుర్కునేది బీజేపీ ఒక్కటే. ఒకప్పుడు 2 ఎంపీ స్థానాలున్న బీజేపీ ఇప్పుడు దేశాన్ని ఏలుతోంది. ప్రస్తుతం ముగ్గురు ఎమ్మెల్యేలతో రాష్ట్రంలో ఉన్నాం. త్వరలో రాష్ట్రాన్ని ఏలుతాం. రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి. గ్రామాలకు నిధులిచ్చేది కేంద్ర ప్రభుత్వమే. ప్రతి పైసా  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇస్తుంటే... అవి ప్రజలకు దక్కకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది. ఏడేళ్లలో సెక్రటేరియట్‌‌కు పోని సీఎంగా కేసీఆర్‌‌‌‌ గిన్నీస్​బుక్‌‌ రికార్డుల్లోకి ఎక్కడం ఖాయం. బీజేపీకి భయపడే కేసీఆర్ పీకేని స్ట్రాటజిస్టుగా పెట్టుకున్నారు. అన్ని పార్టీలు కలిసి బీజేపీని ఎదుర్కోవడానికి ఎన్నికలకు వస్తున్నాయి. ‘పేదోళ్లు ఆత్మబలిదానం చేస్తే రాష్ట్రం వచ్చింది. కానీ పెద్దోడు రాజ్యమేలుతున్నాడు. గరీబోళ్ల రాజ్యం కోసం బీజేపీ మలిదశ ఉద్యమం మొద‌లుపెట్టింది. బీజేపీ నాయకత్వంలో గడీలు బద్దలు కొట్టి తెలంగాణ ద్రోహిని తరిమికొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు’’ అని విజ‌య‌శాంతి పేర్కొన్నారు.

Updated Date - 2022-04-27T01:53:57+05:30 IST