అమరావతి : ప్రతిపక్షాలు చెప్పినట్లు కేంద్రంపై పోరాటం చేయటం కరెక్ట్ కాదని ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే తమ పోరాటం కొనసాగిస్తామని వెల్లడించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి 4 శాతం ఓట్లు తక్కువగా ఉన్నాయన్నారు. బీజేపీ అడిగితే సీఎం జగన్‌రెడ్డి తగిన నిర్ణయం తీసుకుంటారని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.