హైకోర్టుకు ఆ అధికారం లేదు: విజయసాయిరెడ్డి

ABN , First Publish Date - 2020-09-18T21:10:48+05:30 IST

అమరావతి భూములు, ఫైబర్‌నెట్ అవినీతిపై..సీబీఐ విచారణ జరిపించాలంటూ వైసీపీ ఎంపీలు నిరసన తెలిపారు.

హైకోర్టుకు ఆ అధికారం లేదు: విజయసాయిరెడ్డి

న్యూఢిల్లీ: అమరావతి భూములు, ఫైబర్‌నెట్ అవినీతిపై..సీబీఐ విచారణ జరిపించాలంటూ వైసీపీ ఎంపీలు నిరసన తెలిపారు. దీనిపై హైకోర్టు స్టే ఇచ్చిందని మీడియా ప్రశ్నించగా.. ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ గ్యాగ్ ఆర్డర్ రాజ్యాంగ వ్యతిరేకమైన చర్యని, సెక్షన్ 14 ప్రకారం విరుద్ధమని, హైకోర్టుకు ఆ అధికారం లేదని, ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 19(3) ప్రకారం విచారణపై హైకోర్టు స్టే ఇవ్వకూడదని, మరి ఎందుకు ఇచ్చిందో న్యాయస్థానాన్నే అడగాలని సమాధానమిచ్చారు.


ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే స్టే విధించే హక్కు కోర్టుకు ఉంటుందని, అలాంటి ప్రత్యేక పరిస్థితులు ఆంధ్రప్రదేశ్‌లో లేవని విజయసాయిరెడ్డి అన్నారు. సాధారణ పరిస్థితుల్లో విచారణపై స్టే విధించే హక్కు ఏ కోర్టుకు లేదన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే ఇలాంటి పరిస్థితులున్నాయని, రాష్ట్ర పోలీసులపై నమ్మకం లేకపోతే సీబీఐ విచారణకు ఇవ్వొచ్చుని, న్యాయమూర్తులకు ప్రత్యేక చట్టం ఉండదని విజయసాయిరెడ్డి అన్నారు.

Updated Date - 2020-09-18T21:10:48+05:30 IST