Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఇది ఇస్లాం సాధించిన విజయం: పాకిస్థాన్ మంత్రి

ఇస్లామాబాద్: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో పాక్ ఘన విజయం సాధించడంపై ఆ దేశ అంతర్గత శాఖ మంత్రి షేక్ రషీద్ స్పందించారు. ఇది ఇస్లాం సాధించిన విజయంగా అభివర్ణించారు. ఈ మ్యాచ్‌లో పాక్ విజయం సాధించాలని భారత్‌లో ఉన్న ముస్లింలతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలందరూ కోరుకున్నారని అన్నారు.


‘‘భారత జట్టుపై పాకిస్థాన్ సాధించిన విజయం ‘ఇస్లాం విజయం’. ఈ గెలుపుతో ముస్లింలందరూ సంతోషంగా ఉన్నారు’’ అని పేర్కొన్న వీడియో ట్విట్టర్‌లో తిరుగుతోంది. ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ తమకు ఫైనల్ లాంటిందని మంత్రి పేర్కొన్నారు. అయితే, ఆయన వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. క్రీడలను మతంతో ముడిపెట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. పాకిస్థాన్ జట్టు ఏళ్ల తర్వాత భారత్‌పై గెలిచిందన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని మంత్రికి సూచిస్తున్నారు.


ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement