హైదరాబాద్: నగరంలోని మాదాపూర్‌లో కలుషిత నీటి బాధితులు పెరిగిపోతున్నారు. నిన్న రాత్రి వాంతులు, విరేచనాలతో 13 మంది ఆస్పత్రిలో చేరారు. ఇప్పటికే కొండాపూర్ ఆస్పత్రిలో 58మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. కిడ్నీ సంబంధిత క్రియాటిన్ పెరగడంతో ఐదుగురు గాంధీలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు ఆస్పత్రి నుంచి 26 మంది డిశ్చార్జ్ అయ్యారు.
ఇవి కూడా చదవండి