న్యూఢిల్లీ: విజయదశమి పర్వదినం సందర్భంగా దేశ ప్రజలందరికీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు శుభాకాంక్షలు తెలిపారు. భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే దసరా పండుగ చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకుంటారని అన్నారు. అంతేకాకుండా మర్యాద పురుషోత్తముడైన శ్రీరాముడి ఆదర్శవంతమైన జీవనాన్ని మనకు గుర్తుచేస్తుంది. వారు పాటించి చూపిన సన్మార్గంలో మనం కూడా పయనించేందుకు మార్గదర్శనం చేస్తుంది.మనలోని చెడు ఆలోచనలను వదులుకుంటూ సానుకూల దృక్పథంతో ముందుకెళ్లేందుకు దసరాపండుగ అందరి జీవితాల్లో శాంతి, సమరసతా, సమృద్ధి తీసుకురావాలని వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు.