కృష్ణా: దేశంలోని ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ప్రజలందరూ తప్పనిసరిగా మాస్కు వాడాలని సూచించారు. దేశంలో రోజురోజుకీ కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయని ఉపరాష్ట్రపతి పేర్కన్నారు. దేశంలో 40 శాతం వరకే వ్యాక్సినేషన్ పూర్తయ్యిందని వెంకయ్యనాయుడు తెలిపారు. 12 గంటల పాటు ప్రభుత్వం నాణ్యమైన కరెంటు ఇవ్వాలన్నారు. వడ్డీ రేట్లు తగ్గించి రైతులకు రుణాలు ఇవ్వాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు.