తిరుమల: శ్రీవారిని దర్శించుకోవడానికి రేపు తిరుమలకు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు వస్తున్నారు. రాత్రికి తిరుమలలోనే ఉప రాష్ట్రపతి బస చేయనున్నారు. ఎల్లుండి ఉదయం శ్రీవారిని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు దర్శించుకుంటారు. తిరుమలలో ఉప రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.