Abn logo
May 17 2021 @ 12:40PM

ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్త హృదయ విదారకం: వీహెచ్

హైదరాబాద్: ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల ప్రాధాన్యత ఏంటో ఆలోచన చేయాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు పేర్కొన్నారు. అక్కడ రఘురామరాజు, ఇక్కడ ఈటల మీద పెడుతున్న శ్రద్ధ.. కరోనా కట్టడి మీద లేదన్నారు. వాళ్ల మీడియా విచారణకు ఇది సమయం కాదన్నారు. ఇవాళ కాకపోతే రేపైనా జరుపొచ్చన్నారు. వాళ్లపై విచారణ జరుపొచ్చు కానీ పోయే ప్రాణాలు రేపటి వరకు ఆగవన్నారు. ఇపుడు కరోనా మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాలన్నారు. ప్రజల ప్రాణాలు కాపాడాలన్నారు. కొవిడ్ బాధితులు శ్మశానంలో ఉంటున్నారని ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్త హృదయ విదారకరమన్నారు. గ్రామాల్లో, మండలాల్లో ఫంక్షన్ హాళ్లను ఐసోలేషన్ సెంటర్లుగా మార్చే ఆలోచన చేయాలని వీహెచ్ పేర్కొన్నారు.


Advertisement
Advertisement
Advertisement