Advertisement
Advertisement
Abn logo
Advertisement
Nov 27 2021 @ 13:08PM

కేసీఆర్ ధర్నా చేసిన రోజు సంతోషం అనిపించింది: వీహెచ్

హైదరాబాద్: రెండు నెలలుగా వరి ధాన్యం కొనడం లేదని.. రైతులు వరి కుప్పలమీద మరణిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు పేర్కొన్నారు. పండించిన పంటను కొనడం ఆపేసి కేసీఆర్ ఢిల్లీ బాటపడుతున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులను మరిచిపోతోందన్నారు. దేశంలో రైతులకు సంకెళ్లు వేసిన ఏకైక సీఎం కేసీఆర్ అని వీహెచ్ విమర్శించారు. తరుణ్ చుగ్‌కు అసలు తెలివి ఉందా? లేక మాట్లాడుతున్నాడా అని ప్రశ్నించారు. బీజేపీ వాపును చూసి బలుపు అనుకుంటుందన్నారు. దుబ్బాక, హుజురాబాద్‌లో గెలుపుతో ఆగట్లేదని వీహెచ్ అన్నారు. కేసీఆర్ ఇందిరాపార్క్‌లో ధర్నా చేసిన రోజు తనకు సంతోషం అనిపించిందన్నారు. రాచకొండ అడవుల్లో ధర్నా చౌక్ ఉండాలన్న కేసీఆర్ ఇందిరాపార్కులో ఎందుకు ధర్నా చేశావ్? అని ప్రశ్నించారు. మూడు రోజులు ఢిల్లీ వెళ్లి కేసీఆర్ ఏం సాధించావ్? అని నిలదీశారు. కేసీఆర్‌ది అంతా ఓ డ్రామా.. ఈటల మా దగ్గరకు వచ్చినప్పుడు పట్టుకోవాల్సింది.. కానీ ఆయన విషయంలో మేం తప్పు చేశాము’’ అని వీహెచ్ పేర్కొన్నారు. 


Advertisement
Advertisement