Abn logo
May 12 2021 @ 11:00AM

తెలంగాణలోని రామాపురం దగ్గర వాహనాల నిలిపివేత

అమరావతి: తెలంగాణలోని రామాపురం దగ్గర వాహనాలను నిలిపివేస్తున్నారు. తెలంగాణలో లాక్‌డౌన్ కారణంగా వాహనాలను పోలీసులు నిలిపివేస్తున్నారు. రామాపురం క్రాస్ రోడ్డు దగ్గర తెలంగాణ పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ప్యాసింజర్ వాహనాలతో పాటు బైకులను కూడా నిలిపివేస్తున్నారు. ఈ-పాస్, ప్రత్యేక అనుమతులుంటేనే అనుమతిస్తామని తెలంగాణ పోలీసులు చెబుతున్నారు.

Advertisement