ఆన్‌లైన్ లోనే వాహన రుణాలు... త్వరలో అందుబాటులోకి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కొత్త సర్వీసులు...

ABN , First Publish Date - 2020-10-29T01:44:06+05:30 IST

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కొత్త సర్వీసులు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సిద్ధమవుతోంది. ప్రత్యేకించి వెహికల్ లోన్ తీసుకునే వారికి లబ్ది చేకూరేలా ఓ కొత్త ప్లాట్‌ఫామ్ తీసుకువస్తోంది. ఆ తర్వాత మరిన్ని సేవలు అందుబాటులోకి తీసుకురానుంది. ఈ క్రమంలో... ఇక ఆన్‌లైన్‌లో వెహికల్ కొనొచ్చు.

ఆన్‌లైన్ లోనే వాహన రుణాలు... త్వరలో అందుబాటులోకి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కొత్త సర్వీసులు...

ముంబై : హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కొత్త సర్వీసులు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సిద్ధమవుతోంది. ప్రత్యేకించి వెహికల్ లోన్ తీసుకునే వారికి లబ్ది చేకూరేలా ఓ కొత్త ప్లాట్‌ఫామ్ తీసుకువస్తోంది. ఆ తర్వాత మరిన్ని సేవలు అందుబాటులోకి తీసుకురానుంది. ఈ క్రమంలో... ఇక ఆన్‌లైన్‌లో వెహికల్ కొనొచ్చు.


బ్యాంక్ తొలిగా ఆటోమొబైల్ రుణాలకు ఈ తరహా సర్వీసులు అందుబాటులోకి తీసుకువస్తుంది. తర్వాత ఇతర రుణాలకు కూడా ఈ సదుపాయాన్ని విస్తరించనుంది. వచ్చే 2-3 నెలల కాలంలో అంటే కొత్త ఏడాదిలోపు ఈ కొత్త డిజిటల్ రిటైల్ ఫైనాన్సింగ్ ప్లాట్‌ఫామ్ అందుబాటులోకి రావొచ్చు.


హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కొత్త ప్లాట్‌ఫామ్ ద్వారా ఆన్‌లైన్‌లోనే వెహికల్ కొనుగోలుకు సంబంధించిన అన్ని పనులు పూర్తి చేసుకోవచ్చు. విచారణ, ఆర్డర్, ఎక్స్చేంజ్, ఫైనాన్స్, హోమ్ డెలివరీ వరకు అన్ని రకాల సర్వీసులూ ఈ ప్లాట్‌ఫామ్‌లోనే అందుబాటులో ఉంటాయి.


బ్యాంక్ ఇప్పటికే ఈ వెబ్‌సైట్‌కు సంబంధించిన పనులను ప్రారంభించినట్లు సమాచారం. ఈ క్రమంలో పలు ఆటోమొబైల్ కంపెనీలతో చర్చలు జరుపుతోంది. ఆటోమొబైల్స్ మాత్రమే కాకుండా తర్వాత బ్యాంక్ కన్సూమర్ ఎలక్ట్రానిక్ ఫైనాన్సింగ్ సర్వీసులు కూడా ఈ పోర్టల్‌లో అందుబాటులో ఉంచనుంది. ప్రస్తుతం బ్యాంక్.. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్‌బీఐ తో ప్లాట్‌ఫామ్ ఆవిష్కరణ గురించి చర్చిస్తోంది. 

Updated Date - 2020-10-29T01:44:06+05:30 IST