వచ్చే నెల నుంచి... పెరగనున్న వాహన బీమా ధరలు

ABN , First Publish Date - 2022-05-26T23:52:40+05:30 IST

జూన్ నుంచి కార్లు, బైక్‌ల బీమా ధరలు పెరిగే అవకాశముంది.

వచ్చే నెల నుంచి... పెరగనున్న వాహన బీమా ధరలు

న్యూఢిల్లీ : జూన్ నుంచి కార్లు, బైక్‌ల బీమా ధరలు పెరిగే అవకాశముంది. రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ సవరించిన రేట్ల ప్రకారం... వెయ్యి సీసీ ఇంజన్ సామర్థ్యం కలిగిన ప్రైవేట్ కార్లు రూ. 2,094 చొప్పున బీమా రేట్లు చెల్లించాలి. ఈ ఏడాది జూన్ 1 నుంచి ఫోర్ వీలర్, ఫోర్ వీలర్ల బీమా ధరను పెంచే అవకాశముంది. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ(MoRTH) జూన్ 1 నుండి అమల్లోకి వచ్చేలా వివిధ వర్గాల వాహనాలకు థర్డ్-పార్టీ మోటార్ ఇన్సూరెన్స్ ప్రీమియంను పెంచన్నట్లు చెబుతున్నారు. ఈ నిర్ణయం నేపథ్యంలో కార్లు, ద్విచక్ర వాహనాల ధరలు కూడా పెరగనున్నాయి. భారతదేశం ఇప్పటికే పెరుగుతున్న ద్రవ్యోల్బణంతో పోరాడుతున్న తరుణంలో కార్ల బీమా ప్రీమియం పెంపుదల తెరమీదకు వచ్చింది. 

Updated Date - 2022-05-26T23:52:40+05:30 IST