‘వృక్ష వేదం’ అద్భుతం

ABN , First Publish Date - 2021-01-10T08:52:43+05:30 IST

గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ కార్యక్రమంలో భాగంగా తీసుకొచ్చిన ‘వృక్ష వేదం’ పుస్తకం అద్భుతంగా ఉందని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.

‘వృక్ష వేదం’ అద్భుతం

 ప్రజల్లో పచ్చదనంపై చైతన్యం 

తీసుకొస్తుంది: ఎమ్మెల్సీ కవిత


హైదరాబాద్‌, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ కార్యక్రమంలో భాగంగా తీసుకొచ్చిన ‘వృక్ష వేదం’ పుస్తకం అద్భుతంగా ఉందని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న అడవులు, పలు రకాల చెట్ల చిత్రాలను, వేదాల్లోని అంశాలను జోడించి మూడు (తెలుగు, ఇంగ్లిష్‌, హిందీ) భాషల్లో ఈ పుస్తకాన్ని తీసుకురావటం మంచి ప్రయత్నం అని కొనియాడారు. ‘గ్రీన్‌ చాలెంజ్‌’ రూపకర్త టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతో్‌షకుమార్‌ శనివారం వృక్ష వేదం పుస్తకాన్ని ఎమ్మెల్సీ కవితకు అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పర్యావరణ ప్రేమికులకు ఈ పుస్తకం ఆనందాన్ని కలిగిస్తుందని, ప్రజల్లో పచ్చదనంపై చైతన్యాన్ని తీసుకొస్తుందని చెప్పారు. రాష్ట్రంలోని ప్రకృతి అందాలను ఆవిష్కరిస్తూ ఈ పుస్తకాన్ని తీసుకొచ్చిన ఎంపీ సంతో్‌షను కవిత అభినందించారు.

Updated Date - 2021-01-10T08:52:43+05:30 IST