వెజ్‌ మోమోస్‌

ABN , First Publish Date - 2021-03-25T20:36:46+05:30 IST

మైదా: రెండు కప్పులు, నూనె: స్పూను, ఉప్పు, నీళ్లు: తగినంత, క్యాబేజి, ఉల్లి ముక్కలు: ఓ కప్పు, క్యారట్‌ తురుము: ముప్పావు కప్పు, పచ్చి మిర్చి:

వెజ్‌ మోమోస్‌

కావలసిన పదార్థాలు: మైదా: రెండు కప్పులు, నూనె: స్పూను, ఉప్పు, నీళ్లు: తగినంత, క్యాబేజి, ఉల్లి ముక్కలు: ఓ కప్పు, క్యారట్‌ తురుము: ముప్పావు కప్పు, పచ్చి మిర్చి: రెండు (కట్‌ చేసినవి), మిరియాల పొడి: సగం స్పూను, చక్కెర: పావు స్పూను, అల్లం, వెల్లుల్లి ముక్కలు: సగం స్పూను, సోయా సాస్‌: ఓ స్పూను.


తయారు చేసే విధానం : ముందుగా మైదా పిండిలో ఉప్పు, కాస్త నూనె వేసి ముద్దగా కలిపి కాసేపు గుడ్డకప్పి మూసివేయాలి. ఓ పాన్‌లో నూనె వేసి వేడిచేసి అల్లం, వెల్లుల్లి ముక్కలు, తరవాత ఉల్లి ముక్కలు వేసి దోరగా వేగాక మిగతా కూరగాయల ముక్కలన్నీ వేసి వేయించాలి. ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా వేయించి, సోయా సాస్‌ కలిపి పక్కన పెట్టుకోవాలి. మైదా పిండిని ముద్దలుగా చేసుకుని పూరీల్లా వత్తుకోవాలి. ఒక్కో దాంట్లో రెండు స్పూన్ల కూరను వేసి అరచేతిలోకి తీసుకుని పువ్వులా మడచాలి. వీటిని నూనెలో వేయించుకోవచ్చు లేదా కుక్కర్‌లో ఆవిరి కుడుముల్లా చేసుకోవచ్చు.

Updated Date - 2021-03-25T20:36:46+05:30 IST