జగన్ రెడ్డి దెబ్బకు సీబీఐ అబ్బా అన్నట్లుంది: వర్ల

ABN , First Publish Date - 2022-09-14T22:32:09+05:30 IST

జగన్ రెడ్డి దెబ్బకు సీబీఐ అబ్బా అన్నట్లుంది: వర్ల

జగన్ రెడ్డి దెబ్బకు సీబీఐ అబ్బా అన్నట్లుంది: వర్ల

అమరావతి: జగన్మోహన్ రెడ్డి దెబ్బకు సీబీఐ అబ్బా అన్నట్లుందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు. వివేక హత్యకేసు నత్తనడకన సాగటానికి జగన్మోహన్ రెడ్డి దెబ్బే కారణమన్నారు. పోలీసులు సీబీఐకి సహకరించకుండా సహాయనిరాకరణ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డికి వివేకానంద హత్య వెనుక నిజాలు బయటపడటం ఇష్టంలేకనే ఈ విధంగా చేయిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా వివేకానంద హత్యకేసు దర్యాప్తు సీబీఐ డైరెక్టర్ సమీక్షించాలని సూచించారు. 

Updated Date - 2022-09-14T22:32:09+05:30 IST