వర్లరామయ్య విసిరిన సవాల్‌ను స్వీకరిస్తున్నా: మంత్రి విశ్వరూప్‌

ABN , First Publish Date - 2020-06-06T01:39:08+05:30 IST

ఎస్సీల సంక్షేమంపై టీడీపీ నేత వర్లరామయ్య విసిరిన సవాల్‌ను స్వీకరిస్తున్నానని మంత్రి విశ్వరూప్‌ ప్రకటించారు. ఎస్సీల సంక్షేమంపై చర్చకు రావడానికి తాను సిద్ధమని మంత్రి సవాల్ విసిరారు.

వర్లరామయ్య విసిరిన సవాల్‌ను స్వీకరిస్తున్నా: మంత్రి విశ్వరూప్‌

విజయవాడ: ఎస్సీల సంక్షేమంపై టీడీపీ నేత వర్లరామయ్య విసిరిన సవాల్‌ను స్వీకరిస్తున్నానని మంత్రి విశ్వరూప్‌ ప్రకటించారు. ఎస్సీల సంక్షేమంపై చర్చకు రావడానికి తాను సిద్ధమని మంత్రి సవాల్ విసిరారు. ఇసుక గురించి ఎమ్మెల్యే జగ్గిరెడ్డి వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని చెప్పారు. వర్షాకాలం ఇసుక కొరత లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు ఎస్సీ సబ్‌ప్లాన్‌ కింద ఎన్ని నిధులు ఖర్చుపెట్టారో.. అన్ని లెక్కలు తమ దగ్గర ఉన్నాయని తెలిపారు. ఎస్సీ సబ్‌ప్లాన్‌ నిధులను పసుపు కుంకుమ కోసం వాడుకున్నారని విశ్వరూప్‌ ఆరోపించారు.

Updated Date - 2020-06-06T01:39:08+05:30 IST