విజయవాడ : గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ(Vallabhaneni Vamsi)కి కరోనా పాజిటివ్(Corona Positive)గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆయన హైదరాబాద్(Hyderabad)లో హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. ఇటీవల పంజాబ్(Punjab) రాష్ట్రంలోని మొహలీ ఐఎస్బీ క్యాంపస్(ISB Campus)లో క్లాసులకు వెళ్లారు. 14 గంటలు క్యాంపస్‌లోనే గడపాల్సి రావడంతో అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో పూర్తి స్థాయి వైద్య పరీక్షలు చేయించగా ఎమ్మెల్యే వంశీకి కరోనా సోకినట్టు నిర్ధారణ అయ్యింది. గతంలో కూడా వంశీ కరోనా బారినపడ్డారు. వంశీ హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని, కోలుకున్న అనంతరం నియోజవర్గానికి వస్తారని ఆయన సన్నిహితులు వెల్లడించారు.