తెలంగాణలో మార్చి 1 నుంచి వ్యాక్సినేషన్‌పై అధికారుల కసరత్తు

ABN , First Publish Date - 2021-02-27T19:29:53+05:30 IST

తెలంగాణలో మార్చి 1 నుంచి వ్యాక్సినేషన్‌పై అధికారుల కసరత్తు ప్రారంభించారు. కోవిన్ 2.0 పోర్టల్‌పై

తెలంగాణలో మార్చి 1 నుంచి వ్యాక్సినేషన్‌పై అధికారుల కసరత్తు

హైదరాబాద్: తెలంగాణలో మార్చి 1 నుంచి వ్యాక్సినేషన్‌పై అధికారుల కసరత్తు ప్రారంభించారు. కోవిన్ 2.0 పోర్టల్‌పై ఇవాళ, రేపు ట్రయల్‌ రన్‌ నిర్వహిస్తున్నారు. మొత్తం 20 రకాల దీర్ఘకాలిక వ్యాధుల వారికి.. డాక్టర్ ధృవీకరణ పత్రం ఉంటేనే వ్యాక్సినేషన్‌ ఇస్తారు. ప్రైవేట్‌లోనూ వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే తెలంగాణలో 15 లక్షల వ్యాక్సిన్‌ డోసులు సిద్ధం చేశామని అధికారులు చెబుతున్నారు. వేటు ఆస్పత్రుల్లో కొవిడ్‌-19 టీకా సర్వీస్‌ చార్జీని కేంద్ర ప్రభుత్వం ఖరారు చేసింది. టీకా వేయించుకున్నందుకు రూ.100 చెల్లించాలని స్పష్టం చేసింది. దీనికి టీకా ధర అదనమని పేర్కొంది. వ్యాక్సినేషన్‌పై అధికారులు, సిబ్బందికి మొదలైన శిక్షణ ఇస్తున్నారు. 


రాష్ట్రవ్యాప్తంగా 1200 కేంద్రాల్లో టీకాలిస్తారు. అందులో 232 ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రులు కాగా, మిగిలినవన్నీ ప్రభుత్వ ఆస్పత్రులే. ప్రైవేటు ఆస్పత్రుల్లో టీకా తీసుకుంటే సైడ్‌ ఎఫెక్టు వస్తే... అందుకు సంబంధించిన వైద్యం వారే చేయాల్సి ఉంటుందని సర్కారు స్పష్టం చేసింది. ఆరోగ్యశ్రీ ఎంప్యానెల్‌లో లేని ప్రైవేటు ఆస్పత్రుల్లో టీకా తీసుకునే వెసులుబాటు లేదు. ప్రైవేటు ఆస్పత్రులు కేంద్రం సూచించిన బ్యాంకు అకౌంట్‌ నంబరులో డబ్బులు జమచేసినట్లు రసీదును రాష్ట్ర ప్రభుత్వానికి చూపించి, చెల్లించిన మొత్తానికి సరిపడా కొవిడ్‌ వ్యాక్సిన్‌ డోసులను తీసుకెళ్లాలి. ప్రైవేటు, కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో రోజుకు 200 మందికి టీకా వేయొచ్చు. అలాగే 50 పడకలకు మించిన ఎంప్యానెల్‌ ఆస్పత్రిలో 100 మందికి వ్యాక్సిన్లు ఇవ్వొచ్చు. 


Updated Date - 2021-02-27T19:29:53+05:30 IST