వ్యాక్సినేషన్‌ భేష్‌

ABN , First Publish Date - 2021-06-22T08:14:13+05:30 IST

మన రికార్డు ను మనమే తిరగరాసేలా దేశంలోనే గర్వించదగ్గ స్థా యిలో ఆదివారం మెగా వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని చే పట్టిన వైద్యఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బందిని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డి అభినందించారు

వ్యాక్సినేషన్‌ భేష్‌

వైద్యారోగ్యశాఖ అధికారులకు సీఎం జగన్‌ అభినందన


అమరావతి, జూన్‌ 21(ఆంధ్రజ్యోతి): మన రికార్డు ను మనమే తిరగరాసేలా దేశంలోనే గర్వించదగ్గ స్థా యిలో ఆదివారం మెగా వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని చే పట్టిన వైద్యఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బందిని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డి అభినందించారు. కొవిడ్‌ నివారణ చర్యలు, వైద్య ఆరోగ్య రంగంలో ‘నాడు-నేడు’పై సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. కొత్త వైద్య కళాశాలల పనులు యుద్ధ ప్రాతిపదికన జరగాలన్నా రు. బిల్డింగ్‌, నాన్‌ బిల్డింగ్‌ సర్వీసులపై అధికారులు సీఎం జగన్‌కు వివరాలు అందజేశారు. ఆస్పత్రుల ఆవరణ పరిశుభ్రంగా ఉండాలని అధికారులకు సీఎం స్ప ష్టం చేశారు. ఆస్పత్రుల పరిశుభ్రతపై స్టాండర్డ్‌ ఆఫ్‌ ప్రొసీజర్స్‌(ఎస్‌ఓపీ) రూపొందించాలని ఆదేశించారు. ప్రభుత్వాస్పత్రులు, కార్పొరేట్‌ ఆస్పత్రులతో పోటీ పడాలన్నారు. ఆస్పత్రుల ఎమర్జెన్సీ ప్లాన్‌ కూడా సిద్ధం చేయాలన్నారు. కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో ప్రొటోకాల్స్‌పై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని సీఎం కోరారు. 


నేటి నుంచి కర్ణాటక బస్సులు


బెంగళూరు, జూన్‌ 21(ఆంధ్రజ్యోతి): కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా ఇన్నాళ్లూ డిపోలకే పరిమితమైన కర్ణాటక ఆర్టీసీ బస్సులు మంగళవారం నుంచి తెలుగు రాష్ట్రాలకు సర్వీసులు ప్రారంభించనున్నాయి. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో తమ సర్వీసులు నడుపుతామని కేఎ్‌సఆర్టీసీ అధికారులు సోమవారం ప్రత్యేక ప్రకటనలో తెలిపారు. సోమవారం నుంచే కేఎ్‌సఆర్టీసీ అంతర్రాష్ట్ర సర్వీసులన్నీ ప్రారంభం కాగా మంగళవారం నుంచి తెలుగు రాష్ట్రాల్లోనూ మొదలుకానున్నాయి. అయితే ఏపీలో ఉదయం 6 గంటల నుంచి సా యంత్రం 6 గంటల వరకు మాత్రమే లాక్‌డౌన్‌ వెసులుబాటు ఉండటంతో కేవలం పగటి వేళల సర్వీసులు మాత్రమే తిప్పనున్నారు. కేఎ్‌సఆర్టీసీ సర్వీసులు వస్తుండడంతో తెలుగు రాష్ట్రాలు కూడా కర్ణాటకకు తమ సర్వీసులు నడిపేందుకు రెడీ అయ్యాయి. అవి కూడా పగటి పూట సర్వీసులనే నడపాలని నిర్ణయించుకున్నాయి. కాగా.. కర్ణాటక నుంచి తెలుగు రాష్ట్రాలకు మాత్రమే అనుమతిచ్చారు. పొరుగున ఉండే తమిళనాడు, కేరళలో లాక్‌డౌన్‌ నిబంధనలు అమలులో ఉన్నందున కర్ణాటకలో ఆయా రాష్ట్రాల బస్సుల సంచారం ఉండదు.

Updated Date - 2021-06-22T08:14:13+05:30 IST