అమెరికా సంచలన నిర్ణయం.. వ్యాక్సిన్ తప్పనిసరి లేదంటే ఉద్యోగం ఊస్ట్!

ABN , First Publish Date - 2021-07-27T11:40:28+05:30 IST

అమెరికా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. వెటరన్ అఫైర్స్ విభాగంలో వ్యాక్సిన్‌ తీసుకోవడాన్ని

అమెరికా సంచలన నిర్ణయం.. వ్యాక్సిన్ తప్పనిసరి లేదంటే ఉద్యోగం ఊస్ట్!

వాషింగ్టన్: అమెరికా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. వెటరన్ అఫైర్స్ విభాగంలో వ్యాక్సిన్‌ తీసుకోవడాన్ని తప్పనిసరి చేసింది. ఈ విషయాన్ని యూఎస్ అధ్యక్షుడు జోబైడెన్ కూడా ధ్రువీకరించారు. ఈ క్రమంలోనే ఈ విభాగంలో ఉద్యోగాలు చేస్తున్న వారికి ప్రభుత్వం హెచ్చరిక చేసింది. ఈ విభాగంలో పనిచేసే ఫ్రంట్‌లైన్ వర్కర్లందరూ రాబోయే రెండు నెలల్లో ఉద్యోగులందరూ తప్పనిసరిగా కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలని, లేదంటే ఉద్యోగాల్లో నుంచి తొలగిస్తామని తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో బైడెన్ కూడా ‘డాక్టర్లందరూ’ వ్యాక్సిన్ తప్పనిసరిగా తీసుకోవాలని స్పష్టంచేశారు. ప్రస్తుతం అమెరికాలో డెల్టా వేరియంట్ విజృంభిస్తోంది. దీని ధాటికి అమెరికాలో కరోనా కేసులు 68శాతం పెరుగుదలను చూశాయి. ఈ క్రమంలోనే చాలా వైద్యబృందాలు.. ఆరోగ్యశాఖ సిబ్బంది అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని పిలుపునిచ్చాయి. ఈ క్రమంలోనే ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకొని వెటరన్ అఫైర్స్ విభాగంలో వ్యాక్సిన్ తప్పనిసరి నిబంధన తీసుకొచ్చింది.

Updated Date - 2021-07-27T11:40:28+05:30 IST