టీఆర్ఎస్, బీజేపీపై సీఈసీకి ఉత్తమ్ ఫిర్యాదు

ABN , First Publish Date - 2020-10-28T01:36:41+05:30 IST

భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ ఆరోరాకు తెలంగాణ పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ రాశారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీ అధికార దుర్వినియోగం చేస్తున్నాయని లేఖలో ఫిర్యాదు చేశారు. ‘డబ్బులు, మద్యం

టీఆర్ఎస్, బీజేపీపై సీఈసీకి ఉత్తమ్ ఫిర్యాదు

హైదరాబాద్: భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ ఆరోరాకు తెలంగాణ పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ రాశారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీ అధికార దుర్వినియోగం చేస్తున్నాయని లేఖలో ఫిర్యాదు చేశారు. ‘డబ్బులు, మద్యం విచ్చలవిడిగా పంచిపెడుతున్నాయి. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు మామ ఇంట్లో 18 లక్షల రూపాయల నగదు దొరికింది. రఘునందన్ రావు అనుచరులు దుబ్బాకలో పంపిణీ చేయడానికి 40 లక్షలు తరలిస్తుండగా పోలీస్‌లు ఇప్పటికే ఒకసారి పట్టుకున్నారు. టీఆర్ఎస్ డబ్బులిచ్చి ఇతర పార్టీల నాయకులను చేర్చుకుంటున్నారు. కాంగ్రెస్ నాయకుడు టీఆర్ఎస్‌లో చేరిన సందర్భంలో డబ్బులిస్తామని ఆఫర్ చేసినట్లు చెప్పిన ఆధారం ఉంది. డబ్బులు దొరికిన కారణంగా గతంలో ఆర్కేపురం అసెంబ్లీ, వెల్లూరు లోక్‌సభ ఎన్నికలు వాయిదా వేశారు. ఎన్నికలు సజావుగా జరగాలంటే కేంద్ర బలగాలను పంపించాలి’ అని లేఖలో ఉత్తమ్ కోరారు.

Updated Date - 2020-10-28T01:36:41+05:30 IST