సాధారణంగా మెరుగు

ABN , First Publish Date - 2020-02-25T11:01:07+05:30 IST

నిఫ్టీ ఫ్యూచర్స్‌ 10.15 సమయానికి ప్రారంభ స్థాయి/సగటు (ఎటిపి) కన్నా పైన ట్రేడవుతుంటే తగు స్టాప్‌లా్‌సతో లాంగ్‌ పొజిషన్లు తీసుకుని 12 గంటల సమయానికి క్లోజ్‌ చేసుకోవాలి. 12.15 తర్వాత ఎటిపి కన్నా దిగువకు వస్తే

సాధారణంగా మెరుగు

తిథి : ఫాల్గుణ శుక్ల విదియ

నక్షత్రం : పూర్వాభాద్ర

అప్రమత్తం : రోహిణి, హస్త, శ్రవణం నక్షత్ర జాతకులు, మీన, కర్కాటక రాశుల వారు అప్రమత్తంగా ఉండాలి.

ట్రెండ్‌ మార్పు వేళలు : 12.26

ధోరణి : నిఫ్టీ ఫ్యూచర్స్‌ 10.10 నుంచి 12 గంటల వరకు నిలకడగా ట్రేడ్‌ కావచ్చు. ఆ తర్వాత  2 గంటల వరకు నిస్తేజంగా  ఉండి తదుపరి చివరి వరకు మెరుగ్గా ట్రేడయ్యే ఆస్కారం ఉంది.

ట్రేడింగ్‌ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్‌ 10.15 సమయానికి ప్రారంభ స్థాయి/సగటు (ఎటిపి) కన్నా పైన ట్రేడవుతుంటే తగు స్టాప్‌లా్‌సతో లాంగ్‌ పొజిషన్లు తీసుకుని 12 గంటల సమయానికి క్లోజ్‌ చేసుకోవాలి. 12.15 తర్వాత ఎటిపి కన్నా దిగువకు వస్తే షార్ట్‌ పొజిషన్లు తీసుకుని 2 గంటల వరకు ఉంచుకోవచ్చు. తదుపరి ఎటిపి కన్నా పైకి వస్తే లాంగ్‌ పొజిషన్లు తీసుకుని ముగింపు సమయానికి క్లోజ్‌ చేసుకోవాలి. 

నిరోధం : 11870, 11910 

మద్దతు స్థాయిలు : 11790, 11755

ఇంట్రాడే ట్రేడింగ్‌కు ప్రారంభ స్థాయి కీలకం. అంతకన్నా దిగువన మాత్రమే షార్ట్‌ పొజిషన్లు శ్రేయస్కరం.

గమనిక : ఇది పూర్తిగా ఆస్ర్టోటెక్నికల్‌ అంశాల ఆధారంగా ఇచ్చిన సూచన. మార్కెట్‌ వాస్తవిక కదలికల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాలి.

Updated Date - 2020-02-25T11:01:07+05:30 IST