సమయస్ఫూర్తితో తెలివిగా ఆలోచించింది.. విలువైన కారును పగిలిపోకుండా కాపాడుకుంది!

ABN , First Publish Date - 2021-12-19T01:46:17+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాలో ప్రసుతం ప్రజలంతా కరోనా కొత్త వేరియంట్ ఒమైక్రాన్‌‌తో హడలెత్తిపోతున్నారు.

సమయస్ఫూర్తితో తెలివిగా ఆలోచించింది.. విలువైన కారును పగిలిపోకుండా కాపాడుకుంది!

శాన్‌ఫ్రాన్సిస్కో: అగ్రరాజ్యం అమెరికాలో ప్రసుతం ప్రజలంతా కరోనా కొత్త వేరియంట్ ఒమైక్రాన్‌‌తో హడలెత్తిపోతున్నారు. శరవేగంగా ప్రబలుతున్న ఈ వేరియంట్ చాలా తక్కువ వ్యవధిలోనే ఆ దేశంలోని 38 రాష్ట్రాలకు పాకింది. ఇలా జనాలు ఒక పక్క ఒమైక్రాన్‌తో వణికిపోతుంటే మరో పక్క వారికి దొంగల బెడద తప్పడం లేదు. వైరస్‌కు భయపడి చాలావరకు అక్కడి జనాలు తమ సోంత వాహనాల్లోనే వెళ్తున్నారు. సొంత కార్లు లేనివారు ట్యాక్సీలను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదునుగా భావించి దోపిడి దొంగలు రెచ్చిపోతున్నారు. మార్గ మధ్యలో కార్లను ఆపి అందులో ఉన్నవారిని భయపెట్టి వారి దగ్గరి నుంచి చేతికి అందినకాడికి దోచుకెళ్తున్నారు. ఈ క్రమంలో వారు కార్లను ధ్వంసం కూడా చేస్తున్నారు. ఇదే తరహాలో దొంగలు దోపిడికి యత్నించగా ఓ మహిళ మాత్రం సమయస్ఫూర్తితో తెలివిగా ఆలోచించి తన కారుని ధ్వంసం చేయనివ్వకుండా కాపాడుకుంది.


అసలేం జరిగిందంటే... శాన్‌ఫ్రాన్సిస్కో బే ప్రాంతాల్లో దోపిడి దొంగలు బీభత్సం సృష్టించారు. అక్కడ ఉన్న జనాలను బెదిరించి వారి వద్ద నుంచి విలువైన వస్తువులు, డబ్బులు లాక్కెళ్లడం చేశారు. అలాగే దొంగలు రహదారులపై కార్లలో వస్తున్న వారిని కూడా ఆపి లూటీ చేశారు. ఇదే విధంగా పరిషా హెమ్మత్ అనే మహిళ కారు దగ్గరకు సైతం వెళ్లారు. దాంతో ఆమె వారి చర్యను ముందే పసిగట్టింది. తన దగ్గరకు రాగానే ఆమె తన కారుని కాపాడుకునేందుకు తానే ముందుగా కారు డిక్కి ఒపెన్‌ చేసేసింది. తన కారులో ఏమిలేవని, కావాలంటే చూడండంటూ చూపించింది. దాంతో ఆ దొంగలు ఒక్కసారిగా నిర్ఘాంతపోయి ఆమెను ఏమీ చేయకుండా అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఈ విషయాన్ని హెమ్మత్ మీడియాతో చెప్పడం వల్ల బయటకు వచ్చింది. దాంతో ఆమె సమయస్ఫూర్తిని, తెలివితెటలను మెచ్చుకుంటూ అక్కడి సోషల్ మీడియాలో పలువురు పోస్టులు పెడుతున్నారు.  

Updated Date - 2021-12-19T01:46:17+05:30 IST