Texas shooting.. ఆ పాపం నీదే అంటూ అమెరికా సెనెటర్‌పై ప్రజాగ్రహం..!

ABN , First Publish Date - 2022-05-30T03:03:07+05:30 IST

అమెరికా సెనెటర్ టెడ్ క్రజ్‌ కూడా ప్రజాగ్రహానికి గురయ్యారు. హ్యూస్టన్‌ నగరంలో నేషనల్ రైఫిల్స్ అసోసియేషన్ నిర్వహించిన ఓ సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఆ మీటింగ్ అనంతరం.. టెడ్‌ క్రజ్‌కు ఎదురుపడ్డ ఓ వ్యక్తి ఆయనపై విమర్శలు గుప్పించారు.

Texas shooting.. ఆ పాపం నీదే అంటూ అమెరికా సెనెటర్‌పై ప్రజాగ్రహం..!

ఎన్నారై డెస్క్: ఇటీవల టెక్సాస్ రాష్ట్రంలోని ఓ ప్రాథమిక పాఠశాలలో జరిగిన కాల్పుల ఘటన అమెరికాను కుదిపేస్తోంది. ఈ ఘటనలో 19 మంది చిన్నారులు, ఇద్దరు టీచర్లు మరణించారు. ఈ క్రమంలో అమెరికాలో తుపాకీ సంస్కృతిపై మళ్లీ చర్చ మొదలైంది. తుపాకీ తయారీ కంపెనీలకు మద్దతుగా నిలుస్తున్నవారిపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా అమెరికా సెనెటర్ టెడ్ క్రజ్‌ కూడా ప్రజాగ్రహానికి గురయ్యారు. హ్యూస్టన్‌ నగరంలో నేషనల్ రైఫిల్స్ అసోసియేషన్ నిర్వహించిన ఓ సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఆ మీటింగ్ అనంతరం.. టెడ్‌ క్రజ్‌కు ఎదురుపడ్డ ఓ వ్యక్తి ఆయనపై విమర్శలు గుప్పించారు. టెక్సాస్ షూటింగ్ పాపం నీదే అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సెక్యూరిటీ సిబ్బంది ఆ వ్యక్తిని బలవంతంగా పక్కకు తీసుకెళ్లారు. 



Updated Date - 2022-05-30T03:03:07+05:30 IST