సీడీసీ ప్రకటనను తప్పుబట్టిన యూఎస్ నర్సెస్ యూనియన్

ABN , First Publish Date - 2021-05-17T19:28:47+05:30 IST

మాస్క్‌ల విషయంలో యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ చేసిన ప్రకటనను అమెరికాలోని నర్సుల యూనియన్ తప్పుబట్టింది. అలా చేయడం ప్రమాదకరం అని హెచ్చరించింది. పూర్తి వివరాల్లోకి వెళి

సీడీసీ ప్రకటనను తప్పుబట్టిన యూఎస్ నర్సెస్ యూనియన్

వాషింగ్టన్: మాస్క్‌ల విషయంలో యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ చేసిన ప్రకటనను అమెరికాలోని నర్సుల యూనియన్ తప్పుబట్టింది. అలా చేయడం ప్రమాదకరం అని హెచ్చరించింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. అగ్రరాజ్యం అమెరికాలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ చురుకుగా సాగుతోంది. ఈ క్రమంలో అమెరికాలోని వ్యాధి నియంత్రిణ, నివారణ కేంద్రం (సీడీసీ) మాస్క్‌ల విషయంలో మార్గదర్శకాలను సవరించింది. పూర్తిగా వ్యాక్సిన్ తీసుకున్నవారు బహిరంగా ప్రదేశాల్లో, ఇళ్లు, కార్యాలయాల వంటి ప్రదేశాల్లో మాస్క్‌లు పెట్టుకోవాల్సిన అవసరం లేదని ప్రకటించింది. అయితే సీడీసీ నిర్ణయాన్ని నర్సుల యూనియన్ తప్పుబట్టింది. దీని వల్ల ఫ్రంట్‌లైన్ వర్కర్ల ఆరోగ్యం ప్రమాదంలో పడే అవకాశం ఉందని అభిప్రాయపడింది. రిజిస్టర్డ్ నర్సెస్ యూనియన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బొన్నీ కాస్టిల్లో మాట్లాడుతూ సీడీసీ చేసిన సిఫార్సు సైన్స్ ఆధారంగా జరగలేదని అభిప్రాయపడ్డారు. దీన్ని అమలు చేస్తే ఫ్రంట్‌లైన్ వర్కర్‌లతోపాటు సాధారణ ప్రజల ఆరోగ్యం కూడా ప్రమాదంలో పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రక్షణ చర్యలను సడలించడానికి ఇది సమయం కాదన్నారు. వ్యాక్సిన్ వేసుకున్న వారిలో కొందరు మహమ్మారి బారినపడుతున్నట్టు గుర్తు చేశారు.  


Updated Date - 2021-05-17T19:28:47+05:30 IST