సబ్బు కొనేందుకు వెళ్లి కోటీశ్వరుడిగా మారిపోయాడు.. అమెరికాలో..

ABN , First Publish Date - 2021-04-11T06:09:28+05:30 IST

అదృష్టం ఎప్పుడు ఎవరిని ఏ విధంగా వరిస్తుందో ఎవ్వరం చెప్పలేం. అమెరికాలోని వర్జీనియా రాష్ట్రానికి చెందిన

సబ్బు కొనేందుకు వెళ్లి కోటీశ్వరుడిగా మారిపోయాడు.. అమెరికాలో..

వర్జీనియా: అదృష్టం ఎప్పుడు ఎవరిని ఏ విధంగా వరిస్తుందో ఎవ్వరం చెప్పలేం. అమెరికాలోని వర్జీనియా రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి సబ్బు కొనేందుకు వెళ్లి కోటీశ్వరుడిగా మారిపోయాడు. వివరంగా చెప్పాలంటే.. బ్రైన్ జాస్పర్ అనే వ్యక్తి అంట్లు తోమేందుకు అవసరమయ్యే సబ్బును కొనేందుకు స్థానికంగా ఉన్న దుకాణానికి వెళ్లాడు. సబ్బుతో పాటు ఇదే దుకాణంలో పది లక్షల డాలర్ల(రూ. 7.47 కోట్లు) లాటరీ టికెట్‌ను కూడా కొనుగోలు చేశాడు. సాధారణంగా 10,60,800 మందిలో ఒక్కరు మాత్రమే ఈ లాటరీ టికెట్ గెలిచే అవకాశం ఉంటుందని లాటరీ సంస్థ చెబుతోంది. 


అనుకోకుండా ఈ టికెట్‌ను కొనుగోలు చేసిన బ్రైన్ పది లక్షల డాలర్ల(రూ. 7.47 కోట్లు) ప్రైజ్‌ను గెలుపొందడం తమకు కూడా ఆశ్చర్యంగా ఉందంటూ లాటరీ సంస్థ తెలిపింది. మరోపక్క తాను పది లక్షల డాలర్లు(రూ. 7.47 కోట్లు) గెలుపొందడం ఇప్పటికీ కలగానే ఉందంటూ బ్రైన్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. తాను చిన్న వ్యాపారాన్ని నడుపుతున్నానని, లాటరీ ద్వారా వచ్చిన డబ్బుతో తన వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తానంటూ బ్రైన్ చెప్పుకొచ్చాడు.

Updated Date - 2021-04-11T06:09:28+05:30 IST