అమెరికాలో కరోనా మరణాలు ప్రకటించిన దానికి రెట్టింపు?

ABN , First Publish Date - 2020-10-21T14:13:56+05:30 IST

ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు, మరణాలు అమెరికాలోనే నమోదైన విషయం తెలిసిందే. అధికారిక లెక్కల ప్రకారం.. అమెరికాలో ఇప్పటివరకు 2.21లక్షలమందికిపైగా కరోనాతో మరణించారు.

అమెరికాలో కరోనా మరణాలు ప్రకటించిన దానికి రెట్టింపు?

వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు, మరణాలు అమెరికాలోనే నమోదైన విషయం తెలిసిందే. అధికారిక లెక్కల ప్రకారం.. అమెరికాలో ఇప్పటివరకు 2.21లక్షలమందికిపైగా కరోనాతో మరణించారు. అయితే నిజానికి ఈ మరణాల సంఖ్య నాలుగు లక్షలకు పైగా ఉన్నట్టు సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ) అనాలసిస్‌లో తేలింది. అనాలసిస్‌లో భాగంగా వివిధ కారణాల వల్ల 2015 - 2019 మధ్య ఏటా నమోదైన మరణాలతో పోలిస్తే ఈ ఏడాది మృతుల సంఖ్య భారీగా పెరిగినట్లు తేలింది. ఈ డేటాతో పోలిస్తే జనవరి చివరి నుంచి అక్టోబర్ 3 వరకు సుమారు 3లక్షల మంది అధికంగా మరణించినట్లు వెల్లడైంది. ఈ అధిక మరణాల్లో 2లక్షల కేసులకు కరోనాతో సంబంధం ఉన్నట్లు పరిశోధకులు భావిస్తున్నారు. టెస్టింగ్, పోస్ట్‌మార్టం, డెత్ సర్టిఫికెట్ ఇలా కేవలం కొన్ని విధాలుగానే కరోనా మరణాలను అధికారికంగా లెక్క వేసినట్టు సీడీసీ గుర్తించింది.

Updated Date - 2020-10-21T14:13:56+05:30 IST