Green Card: కీలక ‘ఈగిల్‌’ బిల్లుకు ఆమోదం.. చట్టంగా మారితే భారతీయులకు భారీ ప్రయోజనం

ABN , First Publish Date - 2022-04-08T12:33:20+05:30 IST

ఉద్యోగ వీసాలపై అమెరికాలో ఉండేవారికి ఇచ్చే గ్రీన్‌కార్డులపై దేశాలవారీగా ఉన్న పరిమితిని ఎత్తేసి, కుటుంబ వీసాలపై అక్కడ ఉండేవారికి ఇచ్చే గ్రీన్‌కార్డుల పరిమితిని 7 నుంచి 15 శాతానికి పెంచే బిల్లుకు ‘యూఎస్‌ హౌస్‌ జ్యుడీషియరీ కమిటీ’ ఆమోదం లభించింది. ‘ఈక్వల్‌ యాక్సెస్‌ టు గ్రీన్‌ కార్డ్స్‌ ఫర్‌ లీగల్‌ ఎంప్లాయ్‌మెంట్‌ (ఈగిల్‌) యాక్ట్‌’ పేరిట..

Green Card: కీలక ‘ఈగిల్‌’ బిల్లుకు ఆమోదం.. చట్టంగా మారితే భారతీయులకు భారీ ప్రయోజనం

గ్రీన్‌కార్డులపై దేశాలవారీ పరిమితిని ఎత్తేసే ‘ఈగిల్‌’ బిల్లుకు కీలక కమిటీ ఆమోదం

చట్టంగా మారితే భారతీయులకు, 

చైనీయులకు ప్రయోజనం

న్యూయార్క్‌, ఏప్రిల్‌ 7: ఉద్యోగ వీసాలపై అమెరికాలో ఉండేవారికి ఇచ్చే గ్రీన్‌కార్డులపై దేశాలవారీగా ఉన్న పరిమితిని ఎత్తేసి, కుటుంబ వీసాలపై అక్కడ ఉండేవారికి ఇచ్చే గ్రీన్‌కార్డుల పరిమితిని 7 నుంచి 15 శాతానికి పెంచే బిల్లుకు ‘యూఎస్‌ హౌస్‌ జ్యుడీషియరీ కమిటీ’ ఆమోదం లభించింది. ‘ఈక్వల్‌ యాక్సెస్‌ టు గ్రీన్‌ కార్డ్స్‌ ఫర్‌ లీగల్‌ ఎంప్లాయ్‌మెంట్‌ (ఈగిల్‌) యాక్ట్‌’ పేరిట రూపొందించిన ఈ ముసాయిదా బిల్లు.. ప్రతినిధుల సభలో చర్చకు, ఓటింగ్‌కు వెళ్లనుంది. ఆ తర్వాతసెనెట్‌లో కూడా ఆమోదం పొందాల్సి ఉంది. సెనెట్‌ కూడా పచ్చజెండా ఊపితే.. దానిపై అధ్యక్షుడు జో బైడెన్‌ సంతకం చేశాక చట్టంగా మారుతుంది.


ఈ బిల్లు చట్టంగా మారితే భారతీయులకు, చైనీయులకు ఎక్కువ ప్రయోజనం.ప్రపంచంలోని అన్ని దేశాల నుంచి అమెరికాకు వచ్చి శాశ్వతంగా స్థిరపడాలనుకునేవారికి సమానంగా అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో దశాబ్దాల క్రితం గ్రీన్‌కార్డులపై దేశాలవారీగా 7 శాతం పరిమితిని విధించారు. భారత్‌ లాంటి పెద్ద దేశం నుంచి వచ్చేవారికైనా, చిన్న చిన్న దేశాల నుంచి వచ్చేవారికైనా సరే ఒకే సంఖ్యలో గ్రీన్‌కార్డులు ఇచ్చే విధానం ఇది. దీనివల్ల భారత్‌, చైనా లాంటి దేశాల నుంచి ఎక్కువ మంది ఉద్యోగులను అమెరికా కంపెనీలు నియమించుకోలేని పరిస్థితి ఉంది. ఆ ఇబ్బందిని తప్పించేందుకే ఈ బిల్లును రూపొందించారు.

Updated Date - 2022-04-08T12:33:20+05:30 IST