విజయనగరం: మన్సాస్ ట్రస్ట్ వ్యవహారం మరో మలుపు తిరిగింది. ట్రస్ట్ వివాదంలో ఏపీ హైకోర్టును ఊర్మిళ గజపతిరాజు ఆశ్రయించారు. ట్రస్ట్‌పై సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టులో అప్పీలు చేశారు. ఆనందగజపతిరాజు రెండో భార్య కుమారై ఊర్మిళ గజపతిరాజు. దీనిపై తదుపరి విచారణను రేపటికి ఏపీ హైకోర్టు వాయిదా వేసింది.