రూ.5 లక్షలలోపు రిఫండ్స్‌ చెల్లింపు

ABN , First Publish Date - 2020-04-09T06:25:03+05:30 IST

ఆదాయ పన్ను (ఐటీ) శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రూ.5 లక్షల వరకు పెండింగ్‌లో ఉన్న రిఫండ్‌లను వెంటనే ఆయా ఐటీ చెల్లింపుదారుల ఖాతాల్లో జమ చేయాలని...

రూ.5 లక్షలలోపు రిఫండ్స్‌ చెల్లింపు

  • ఐటీ శాఖ కీలక నిర్ణయం
  • వెంటనే జీఎస్‌టీ, కస్టమ్స్‌ రిఫండ్స్‌

న్యూఢిల్లీ: ఆదాయ పన్ను (ఐటీ) శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రూ.5 లక్షల వరకు పెండింగ్‌లో ఉన్న రిఫండ్‌లను వెంటనే ఆయా ఐటీ చెల్లింపుదారుల ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించింది. దీంతో దాదాపు 14 లక్షల మంది వ్యక్తిగత ఐటీ చెల్లింపుదారులు లబ్ధి పొందుతారని అంచనా. దీనికి తోడు సుమారు లక్ష వ్యాపార సంస్థలకు చెల్లించాల్సిన దాదాపు రూ.18,000 కోట్ల జీఎ్‌సటీ, కస్టమ్స్‌ రిఫండ్స్‌నూ వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో  అనేక ఎంఎ్‌సఎంఈలు కూడా ప్రయోజనం పొందుతాయి. కరోనా వైరస్‌ నేపథ్యంలో ప్రజలు, వ్యాపార సంస్థల దగ్గర నిధుల లభ్యత పెంచేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 

Updated Date - 2020-04-09T06:25:03+05:30 IST