బధిర పిల్లల మతమార్పిడి కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్

ABN , First Publish Date - 2021-06-21T19:40:41+05:30 IST

చెవిటి, మూగ పిల్లలను మత మార్పిడి చేసిన ముఠా గుట్టును ఉత్తరప్రదేశ్ పోలీసు తీవ్రవాద నిరోధక దళం రట్టు చేసింది....

బధిర పిల్లల మతమార్పిడి కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్

 లక్నో (ఉత్తరప్రదేశ్): చెవిటి, మూగ పిల్లలను మత మార్పిడి చేసిన ముఠా గుట్టును ఉత్తరప్రదేశ్  పోలీసు తీవ్రవాద నిరోధక దళం రట్టు చేసింది. పిల్లలను మతమార్పిడి చేస్తున్న కేసులో ఢిల్లీ జామియానగర్ నివాసులైన నిందితులు ముఫ్తీ ఖాజీ జహంగీర్ కస్మీ, మహ్మద్ ఉమర్ గౌతమ్ లను యూపీ ఏటీఎస్ అధికారులు సోమవారం అరెస్టు చేశారు.నోయిడాలోని చెవిటి,మూగ పాఠశాలలకు చెందిన  వెయ్యిమందికి పైగా పిల్లలను ఇస్లాం మతంలోకి మార్చారని యూపీ ఏటీఎస్ పోలీసులు చెప్పారు.యూపీలో మతమార్పిడి వ్యతిరేక చట్టం ప్రకారం పెట్టిన కేసులో ఇస్లామిక్ దావా సెంటర్ ఛైర్మన్ పేరు  కూడా చేర్చారు.


మతమార్పిడులు చేస్తున్న ముఠాకు విదేశాల నుంచి నిధులు సమకూరుతున్నట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని యూపీ లాఅండ్ ఆర్డర్ ఏడీజీ ప్రశాంత్ కుమార్ చెప్పారు. నిందితుల వద్ద నుంచి విదేశీ నిధుల పత్రాలు లభించాయని ఏడీజీ చెప్పారు. విచారణ సమయంలో తాము ప్రతి ఏటా 250 నుంచి 300 మందిని మత మార్పిడి చేసినట్లు తేలిందని పోలీసులు చెప్పారు.కాన్పూర్ కళ్యాణ పూర్ కు చెందిన చెవిటి మూగ కుమారుడికి డబ్బు ఇస్తామని, ఉద్యోగం ఇస్తామని చెప్పి మతం మార్చారని ఏడీజీ ప్రశాంత్ కుమార్ చెప్పారు.


Updated Date - 2021-06-21T19:40:41+05:30 IST