YCP కార్యాలయాలుగా యూనివర్సిటీలు

ABN , First Publish Date - 2022-08-10T21:04:24+05:30 IST

యూనివర్సిటీలను జగన్ రెడ్డి (Jagan reddy) వైసీపీ (YCP) కార్యాలయాలుగా మార్చేశారని టీడీపీ (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ (Lokesh) విమర్శలు గుప్పించారు. రెడ్డి రాజ్యంలో వేధింపులు తట్టుకోలేక పదవికి రాజీనామా చేస్తున్నానని ఒక బిసి ఉద్యోగి ప్రకటించడం

YCP కార్యాలయాలుగా యూనివర్సిటీలు

అమరావతి: యూనివర్సిటీలను జగన్ రెడ్డి (Jagan reddy) వైసీపీ (YCP) కార్యాలయాలుగా మార్చేశారని టీడీపీ (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ (Lokesh) విమర్శలు గుప్పించారు. రెడ్డి రాజ్యంలో వేధింపులు తట్టుకోలేక పదవికి రాజీనామా చేస్తున్నానని ఒక బిసి ఉద్యోగి ప్రకటించడం రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలనకు అద్దంపడుతుందన్నారు. జగన్ రెడ్డి (CM Jagan) సొంత సామాజిక వర్గం అధికారుల ఒత్తిడి తట్టుకోలేక అన్నమయ్య జిల్లా కలికిరి జేఎన్టీయూ (JNTU) సూపరింటెండెంట్ నాగభూషణం  వీఆర్ఎస్ తీసుకుంటానని ప్రకటించడం బాధాకరమని అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఆయన్ని అనంతపురం నుంచి అన్నమయ్య జిల్లా కలికిరికి బదిలీ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పెత్తనం మొత్తం ఒకే సామాజిక వర్గానికి అప్పజెప్పి బడుగు, బలహీన వర్గాల ఉద్యోగులను అణగదొక్కాలని చూస్తున్నారన్నారు. వైసీపీ నిరంకుశ ధోరణికి వ్యతిరేకంగా ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉన్న అన్ని యూనివర్సిటీల్లో ఇదే పరిస్థితి ఉందన్నారు. సీఎం కులపిచ్చ తగ్గించుకుని ఇతర సామాజికవర్గాల వారి ఆత్మ గౌరవం కాపాడాలని లోకేష్ హితవుపలికారు. 

Updated Date - 2022-08-10T21:04:24+05:30 IST