కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కలిసిన ఎంపీ కోమటిరెడ్డి
ABN , First Publish Date - 2021-07-11T21:12:26+05:30 IST
తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్ర కేబినెట్‌లో చోటు దక్కించుకున్న సందర్భంగా న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో కిషన్ రెడ్డిని కలిసి అభినందనలు తెలిపారు ఎంపీ కోమటిరెడ్డి.
న్యూఢిల్లీ: చారిత్రక వైభవం కలిగిన భువనగిరి కోట అభివృద్ధికి సహకరించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్ర కేబినెట్‌లో చోటు దక్కించుకున్న నేపథ్యంలో న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో కిషన్ రెడ్డిని ఎంపీ కోమటిరెడ్డి ఆదివారం కలిశారు. పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం భువనగిరి కోట అభివృద్ధిపై లేఖను అందజేశారు.
ప్రత్యేక తెలంగాణలో రాష్ట్ర సర్కార్ కోట అభివృద్ధికి సహకరించడం లేదని లేఖలో పేర్కొన్నారు. దేశంలో ఎన్నో చారిత్రక కట్టడాలు కాలగమనంలో చరిత్రలో కలిసిపోయాయని.. పట్టించుకోకుంటే భువనగిరి కోట కూడా అలాగే అవుతుందని వాపోయారు. పర్యాటక శాఖ మంత్రిగా తగిన నిధులు మంజూరు చేయాలని కోరారు. కోమటిరెడ్డి విజ్ఞప్తిపై స్పందించిన కిషన్ రెడ్డి వెంటనే నిధులు మంజూరు చేస్తామని తెలిపారు.