పందుల వ్యాన్ను హైజాక్ చేసిన గుర్తు తెలియని వ్యకులు
ABN , First Publish Date - 2021-07-02T13:01:08+05:30 IST
నగరంలో సినీఫక్కీలో పందుల వ్యాన్ను గుర్తు తెలియని వ్యక్తులు హైజాక్ చేశారు. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ నుంచి పోలీస్ ఎస్కార్ట్ వాహనం ద్వారా పందులను
విశాఖపట్నం: నగరంలో సినీఫక్కీలో పందుల వ్యాన్ను గుర్తు తెలియని వ్యక్తులు హైజాక్ చేశారు. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ నుంచి పోలీస్ ఎస్కార్ట్ వాహనం ద్వారా పందులను వ్యాన్లో అధికారులు తరలిస్తున్నారు. పందుల వ్యాన్ను దుండగులు హైజాక్ చేశారు. పోలీస్ ఎస్కార్ట్ వాహనం ఉన్నప్పటికీ వ్యాన్ను 20 మంది దుండగులు అడ్డగించారు. అనంతరం వ్యాన్లో ఉన్న డ్రైవర్ను బయటకు లాగేసి..వ్యాన్ను ఎత్తుకెళ్లారు. దుండగులు ఎత్తుకెళ్లిన పందుల వ్యాన్ను పోలీసులు వెంబండించారు. పోలీసులు వెంబడిస్తున్నట్లు తెలుసుకున్న దుండగులు చిత్తూరు వరకు వ్యాన్ను తీసుకువెళ్లి అక్కడే వ్యాన్ వదిలి పరారయ్యారు. సీసీటీవీ పుటేజ్ ఆధారంగా పోలీసులు దుండగుల కోసం గాలిస్తున్నారు.